Back to News
తాజా వార్తలు

ధర్మపురి పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్

జగిత్యాల జిల్లాలో పోలీసింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ధర్మపురి పోలీస్ స్టేషన్‌తో పాటు ధర్మపురి సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, సిబ్బంది పనితీరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని , సర్కిల్ పరిదిలో నమోదవుతున్న గ్రేవ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసులలో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను,పరిశీలించారు. తరచుగా సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేయాలని, సిబ్బంది పనితీరును నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలనీ సి.ఐ కి సూచించారు.కమ్యూనిటీ పోలీసులలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలకు సైబర్ నేరాలు వివిధ సామాజిక అంశాలపై ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని అన్నారు. అదేవిధంగా సి సి కెమెరాలు యొక్క ప్రాముఖ్యత గురించి గ్రామాల్లో తెలియజేస్తూ ప్రతి గ్రామoలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.అలాగే నేరాల నియంత్రణలో విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని , మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రతి కానిస్టేబుల్ తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి,ప్రజలతో మమేకమై శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న సమయంలో తప్పనిసరిగా లాఠీ వెంట ఉంచుకోవాలని సూచించారు.

ఈ తనిఖీలో ఎస్పీ గారి వెంట డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, సీఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్‌ఐలు మహేష్, రవీందర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.