Back to News
తాజా వార్తలు

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి

వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికు మంత్రి పదవి ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. రాజకీయాల్లో అనేక మంది పార్టీలు మారినప్పటికీ, దొంతి మాధవరెడ్డి మాత్రం తాను నమ్మిన పార్టీ జెండాను విడవకుండా పార్టీకి విధేయతతో కొనసాగుతున్న నాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొంటున్నారు.
పేదల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారని స్థానికులు చెబుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న దొంతి మాధవరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆయన సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
"పట్టిన జెండా విడువని నాయకుడు – పేదల కష్టాల పెన్నిధి దొంతి మాధవరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి" అని ప్రజలు, అభిమానులు కోరుకుంటున్నారు.