
Back to News
తాజా వార్తలు
మిషన్ భగీరథ నీరు రాక అవస్థలు పడుతున్న గ్రామస్థులు. చోద్యం చూస్తున్న అధికారులు..
చెన్నరావుపేట మండలం అక్కల్ చెడ గ్రామంలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాక గ్రామస్థులు తండా వాసులు ఇబ్బందులకు గురి అయిన సంఘటన గ్రామంలో నెలకొంది.. గ్రామంలో పైపు లైన్ డ్యామేజ్ కావడం వలన నీరు రావడం లేదని గ్రామ సర్పంచ్ భూక్య బుజ్జి సురేష్ మిషన్ భగీరథ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు సిబ్బందిని పంపించారు..అనంతరం వారు పైపు లీకేజిని గుర్తించి మరమ్మత్తు చేయగా త్రాగు నీరు వస్తుందని ఎదురు చూస్తున్న గ్రామస్థులకు నిరాశే ఎదురయ్యింది.. నీరు రావడం లేదని గమనించిన సర్పంచ్ స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బంది వెళ్లి చూడగా మిషన్ భగీరథ సిబ్బంది ఇనుప వాచర్ పెట్టి గ్రామానికి నీటి సరఫరా పూర్తిగా నిలిపివేశారని గ్రామ సర్పంచ్ భూక్య బుజ్జి సురేష్ ఆవేదన వ్యక్తం చేసారు..మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం మిషన్ భగీరత సిబ్బంది అలసత్వం వలన మూడు రోజులు నీరు రాక గ్రామస్తులు ఇబ్బందులకు గురయ్యారని గ్రామ సర్పంచ్ భూక్య బుజ్జి సురేష్ ఈ రోజు ఉదయం గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని అందించారు.



